కోరిక తీర్చలేదని మైనర్ బాలుడిపై యువతి దాష్టీకం!

10-10-2018 Wed 11:34
  • గ్రేటర్ నోయిడా సమీపంలో ఘటన
  • బాలుడి జననాంగాన్ని కత్తిరించిన యువతి
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు

పొరుగింట్లో ఉండే ఓ మైనర్ బాలుడు, తన లైంగిక అవసరాన్ని తీర్చలేదన్న అక్కసుతో అతని జననాంగాలను పట్టకారతో కత్తిరించిందో యువతి. న్యూఢిల్లీ శివార్లలోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు, సదరు యువతిపై కిడ్నాప్, బాలల గృహహింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ యువతి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, బదాల్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చప్రౌలా గ్రామంలో గత శుక్రవారం నాడు, పొరుగింట్లో ఉంటున్న 13 ఏళ్ల బాలుడిని తన ఇంటికి పిలిపించుకుందా యువతి. వివాహిత అయిన ఆ యువతి, తన కోరికను తీర్చాలని బాలుడిని బలవంత పెట్టింది. అందుకు అతను నిరాకరించాడు. దీంతో అగ్రహంతో అతని జననాంగాన్ని కత్తిరించింది. తీవ్ర గాయాలపాలైన బాలుడు, తల్లికి విషయాన్ని చెప్పాడు. దీంతో నిందితురాలిపై ఐపీసీలోని సెక్షన్ 323, 324, 342, 363, 506 సెక్షన్ల కింద కేసు పెట్టామని, విచారిస్తున్నామని తెలిపారు.