sharwanand: మనసును పట్టేస్తోన్న 'పడిపడి లేచె మనసు' టీజర్

  • దర్శకుడిగా హను రాఘవపూడి 
  • ఆయన నుంచి మరో ప్రేమకథా చిత్రం
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల  

ప్రేమకథా చిత్రాల స్పెషలిస్టుగా హను రాఘవపూడి గురించి చెప్పుకోకవచ్చు. ఆయన తాజా చిత్రంగా 'పడి పడి లేచె మనసు' రూపొందింది. శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను వదిలారు. నాయకా నాయికల కాంబినేషన్లోని సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.

ఈ సినిమాలో మెడికోగా సాయిపల్లవి కనిపిస్తోంది. శర్వానంద్ ఆమెను ఫాలో చేయడం .. అది గమనించి ఆమె నిలదీయడం ఈ టీజర్ లో చూపించారు. యూత్ ఆశించే ఫీల్ కంటెంట్ లో కనిపిస్తోంది. సినిమాపై వాళ్లలో ఆసక్తిని రేకెత్తించేదిలానే వుంది. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇటు శర్వానంద్ .. అటు సాయిపల్లవి ఇద్దరూ కూడా విభిన్నమైన కథాంశాలను ఎంచుకునేవారే గనుక, అందరిలోను అంచనాలు వున్నాయి.


More Telugu News