CBI: అలోక్‌ వర్మా, ఇదేం పద్ధతి?... సీబీఐ డైరెక్టర్‌పై కేంద్ర ప్రభుత్వం గుర్రు!

  • సంప్రదాయాన్ని కాదని ఫిర్యాదు దారులతో నేరుగా కలవడంపై ఆక్షేపణ
  • 77 ఏళ్ల సంస్థ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారన్న భావన
  • బాధ్యుల మధ్య వర్గ విభేదాల కోణంలోనూ పరిశీలన

సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌వర్మ ఫిర్యాదీలను నేరుగా కలవడం కలకలం రేపుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డెబ్బయి ఏడేళ్ల చరిత్రలో రాజకీయ నాయకులను డైరెక్టర్‌ కలవడం ఇదే తొలిసారి కావడంతో వర్మపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. వర్మ తీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌శౌరి, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌  ఇటీవల అలోక్‌ వర్మతో సమావేశమయ్యారు. రాఫెల్‌ విమాన కొనుగోలు ఒప్పందంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చిన వారిని అలోక్‌వర్మ కూర్చోబెట్టుకుని మాట్లాడడాన్ని కేంద్రం సీరియస్‌గా పరిగణిస్తోంది.

 సాధారణంగా రాజకీయ నాయకులు ఏదైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే ప్రధాన కార్యాయంలో అందించాలని సూచిస్తారు. అందుకు భిన్నంగా అలోక్‌వర్మ వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. అలాగే సీబీఐ ప్రత్యేక సంచాలకుడు రాకేష్‌ ఆస్థానాతో అలోక్‌వర్మకు వృత్తిపరంగా పడడం లేదు. ఈ విషయాన్ని కూడా కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. 

More Telugu News