USA: ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ రాజీనామా

  • 2016లో అమెరికా రాయబారిగా నియామకం
  • రాజీనామాకు కారణం తెలియాల్సి ఉంది
  • రాజీనామా విషయాన్ని ధ్రువీకరించిన నిక్కీ హేలీ

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇండియన్ అమెరికన్ నిక్కీ హేలీ తన పదవికి నేడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె కూడా ధ్రువీకరించారు. అయితే రాజీనామాకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉందని ఫ్యాక్స్ న్యూస్ తెలిపింది.

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా స్నేహితురాలు, దౌత్యవేత్త నిక్కీ హేలీ ఓవల్‌ ఆఫీస్‌లో 10.30కు కీలక ప్రకటన చేయనున్నారు.’ అని పేర్కొన్నారు. భారతీయ మూలాలు కలిగి వున్న నిక్కీ హేలీని 2016 నవంబర్‌లో ఐరాసకు అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. హేలీ గతంలో సౌత్ కరోలీనా గవర్నర్‌గా పనిచేశారు.

More Telugu News