china: పాక్ కు అత్యాధునిక మిలిటరీ డ్రోన్లు విక్రయించనున్న చైనా

  • చైనా తయారు చేస్తున్న ‘వింగ్ లూంగ్ 2’ మిలిటరీ డ్రోన్లు
  • 48 డ్రోన్లను కొనుగోలు చేయనున్న పాక్  
  • చైనాలోని అధికారిక మీడియా వెల్లడి

చైనా తన వద్ద ఉన్న అత్యాధునిక మిలిటరీ డ్రోన్లు ‘వింగ్ లూంగ్ 2’ను పాకిస్థాన్ కు విక్రయించనున్నట్టు సమాచారం. 48 డ్రోన్లను పాకిస్థాన్ కు విక్రయింనుందని చైనాలోని అధికారిక మీడియా వెల్లడించింది. ఈ తరహా ఒప్పందాలలో ఇదే పెద్దదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్టు మీడియా వార్తా కథనం.

 చైనాలోని చెంగ్ డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రియల్ కంపెనీ తయారు చేస్తోందని గ్లోబల్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. చైనా నుంచి పాక్ ఈ డ్రోన్లను కొనుగోలు చేయనుండటంతో ఆ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. కాగా, చైనా నుంచి మిలిటరీ డ్రోన్లు కొనుగోలు చేయనున్న విషయాన్ని పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన షెర్డిల్స్ ఏరోబాటిక్ బృందం తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొంది.

ఇదిలా ఉండగా, రష్యా నుంచి ఎస్-400 ట్రయంఫ్ రక్షణ క్షిపణులను భారత్ కొనుగోలు చేసేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదర్చుకున్న కొన్ని రోజులకే  పాక్ కు చైనా అత్యాధునిక మిలిటరీ డ్రోన్లు విక్రయించనుండటం గమనార్హం. 

More Telugu News