kodela siva prasad: ఏపీ స్పీకర్ కోడెలకు హైకోర్టులో ఊరట

  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పిటిషన్
  • వ్యక్తిగత విచారణ నుంచి మినహాయింపును ఇచ్చిన హైకోర్టు
  • గతంలో ఇచ్చిన ఆదేశాలను మరికొంత కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు

ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ, గతంలో ఇచ్చిన ఆదేశాలను మరికొంత కాలానికి పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో, విచారణ నిమిత్తం కోర్టుకు ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదు. 2014 ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చు పెట్టానని ఓ టీవీ ఇంటర్వ్యూలో కోడెల చెప్పిన అంశంపై సింగిరెడ్డి భాస్కరరెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన సాక్షాలను కోర్టుకు సమర్పించారు. ఎన్నికల నిబంధన 171 ఈ, ఎఫ్, జీ, ఐ ఆఫ్ 200 ఐపీసీ కింద విచారించాలని పిటిషన్ లో కోరారు. అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎక్కడ నుంచి వచ్చింది? అంత ఖర్చు ఎందుకు పెట్టారు? అనే విషయాలపై విచారణ జరపాలని కోరారు.  

More Telugu News