lokesh: ఐటీ దాడుల పేరుతో ఏపీపై కక్ష సాధిస్తున్నారు: నారా లోకేష్

  • ఇలాంటి దాడులు గతంలో ఎన్నడూ చూడలేదు
  • పెట్టుబడులు పెట్టేవారిని ఆందోళనకు గురిచేస్తున్నారు
  • ఇలా దాడులు చేస్తే ఏపీకి పెట్టుబడులు వస్తాయా?

ఏపీలో పలు సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఐటీ దాడుల పేరిట ఏపీపై కక్ష సాధిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఏపీలో 19 బృందాలు, 200 మంది అధికారులు దాడులు చేశారని, ఏపీలో పెట్టుబడులు పెడుతున్నవారిని ఆందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేస్తే మేం మాట్లాడకూడదా? ఒకరిద్దరిపై గతంలోనూ ఐటీ దాడి చేస్తే మేం పట్టించుకోలేదు. ఈ విధంగా ఐటీ దాడులు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి?' అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పై లోకేష్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జైల్లో ఉండొచ్చిన వారు, విలువల గురించి మాట్లాడుతున్నారని, దేశంలోని టాప్-3 కంపెనీలు ఏపీకి వచ్చాయని, పెద్ద కంపెనీలకు భూములివ్వడం తప్పా? భూ కేటాయింపులపై ఆరోపణలు గుప్పించే వారు సరైన ఆధారాలు చూపాలని, కోరారు. ఇప్పటివరకు, తాము ఏడుసార్లు ఆస్తులు ప్రకటించామని, ప్రతిపక్ష నేతలు కూడా తమ ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

More Telugu News