sensex: ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చిన మార్కెట్లు

  • ఆద్యంతం ఒడిదొడుకుల్లో కొనసాగిన మార్కెట్లు
  • చివరి అరగంటలో పుంజుకున్న కొనుగోళ్లు
  • 97 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదలతో గత కొన్ని సెషన్లుగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఎట్టకేలకు పుంజుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరి అరగంటలో కొంతమేర కొనుగోళ్లు పుంజుకోవడంతో నష్టాలను నుంచి తేరుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 97 పాయింట్లు పెరిగి 34,474కు చేరుకుంది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 10,348 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ పెట్రోలియం (8.15%), యస్ బ్యాంక్ (7.08%), గేట్ వే డిస్ట్రిపార్క్స్ (6.02%), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (5.63%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (5.53%).

టాప్ లూజర్స్:
దేవాన్ హౌసింగ్ (-18.52%), ఎడిల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-13.67%), జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ (-13.10%), గోద్రెజ్ ప్రాపర్టీస్ (-12.67%), స్వాన్ ఎనర్జీ (-11.31%).  

More Telugu News