raghavendra rao: 'అన్నమయ్య' సినిమా విషయంలో నేను టెన్షన్ పడలేదు: రాఘవేంద్రరావు

  • 'అన్నమయ్య'గా నాగార్జుననే అనుకున్నాను 
  • నిర్మాత కూడా ఆయనైతేనే కరెక్ట్ అన్నారు
  • ఈ సినిమా నేను చేయడం స్వామి సంకల్పమే      

రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చెప్పుకోదగిన చిత్రాలలో 'అన్నమయ్య' ఒకటి. రాఘవేంద్రరావు మరికొన్ని భక్తిరస చిత్రాలను తెరకెక్కించడానికి ఈ సినిమా దోహదపడింది. తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో పాల్గొన్న రాఘవేంద్రరావు, 'అన్నమయ్య' సినిమాను గురించి ప్రస్తావించారు. 'అన్నమయ్య' కథను సిద్ధం చేసుకున్న తరువాతనే నాగార్జునతో చేస్తే బాగుంటుందని అనుకున్నాము. నిర్మాత దొరస్వామి రాజు .. అశ్వనీదత్ కూడా నాగార్జున అయితే బాగుంటుందని బలంగా చెప్పారు.

అక్కినేని 'విప్రనారాయణ' .. 'జయభేరి' .. 'భక్త తుకారామ్'వంటి భక్తి చిత్రాలు చేసి మెప్పించడం వలన, నాగార్జునతో చేయించవచ్చని భావించాను. 'అన్నమయ్య' సినిమాలో ఇద్దరు భార్యలతో కలిసి అన్నమయ్య పాటలు పాడినట్టుగా చూపించడానికి నేను టెన్షన్ పడలేదు. నా కోసమే ఆ వేంకటేశ్వర స్వామి 'అన్నమయ్య' కథను  ఉంచాడని నేను అనుకుంటున్నాను" అన్నారు. 

More Telugu News