Flipcart: బజాజ్‌ అలియాంజ్ తో జత కడుతున్న ఫ్లిప్‌కార్ట్‌: కొనుగోలుదార్ల వస్తువులకు బీమా సదుపాయం

  • 10న ప్రారంభమయ్యే బిగ్‌ బిలియన్‌ డేతో ప్రారంభం
  • ప్రధానంగా స్మార్ట్‌ పోన్లకు ప్రయోజనం
  • కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గరికిపాటి రవి

ఆన్‌లైన్‌లో వస్తువులు తరచూ కొనే వారికి శుభవార్త.  ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్ల వస్తువులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ పాడైతే ఆన్‌లైన్‌ ద్వారానే క్లెయిమ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రవి గరికిపాటి తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్లు పగిలిపోయినప్పుడు, చోరీకి గురైనప్పుడు వినియోగదారుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి విరుగుడుగా ఈ బీమా కవరేజీ ఉపయోగపడుతుందన్నారు.

ఇందుకోసం ప్రముఖ బీమా సేవ సంస్థ బజాజ్‌ అలియాంజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రముఖ మొబైల్‌ బ్రాండ్లకు బీమా సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10న ప్రారంభమయ్యే 'బిగ్‌ బిలియన్‌ డేస్'తో ఈ సదుపాయం ప్రారంభం అవుతుందని తెలిపారు.

More Telugu News