Telangana: బీజేపీ అధిష్ఠానం నుంచి పరిపూర్ణానందకు పిలుపు.. బీజేపీలో చేరిక?

  • సోమవారం హస్తినకు రావాలంటూ అమిత్ షా నుంచి పిలుపు
  • బీజేపీలో చేరకకు ముహూర్తం ఖరారు
  • తెలంగాణలో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి?

శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద మరో యోగి ఆదిత్యనాథ్ కాబోతున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ నుంచి ఆయనను సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపాలని, కుదురకుంటే ఎంపీగానైనా ఈ ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ రమ్మంటూ బీజేపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. సోమవారం అత్యవసరంగా హస్తినకు రావాల్సిందిగా బీజేపీ చీఫ్ అమిత్ షా నుంచి పరిపూర్ణానందకు పిలుపు వచ్చింది.

బీజేపీ నుంచి పరిపూర్ణానందుకు పిలుపు వచ్చిన విషయం బయటకు పొక్కగానే ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనేనన్న ప్రచారం మొదలైంది. అయితే, సీఎం అభ్యర్థిగా కాకుంటే ఎంపీగానైనా ఆయనను పోటీ చేయించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన రాజకీయ ప్రవేశంపై పరిపూర్ణానంద గతంలోనే ప్రకటన చేశారు. రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయాన్ని అమ్మవారికే వదిలేశానని ప్రకటించిన ఆయన బీజేపీ, టీఆర్ఎస్‌లలో ఏది ముందు ఆహ్వానిస్తే అందులో చేరి దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. తాజాగా, బీజేపీ నుంచి పిలుపు రావడంతో ఆ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

More Telugu News