Election commission: బీజేపీకి షాకిచ్చిన సర్వే.. ఆ మూడు రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితే!

  • మూడు రాష్ట్రాల్లో ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే
  • మూడు రాష్ట్రాల్లో బీజేపీకి కష్టమే
  • 15ఏళ్ల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్..

ఎన్నికల కమిషన్‌ శనివారం ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరాం, రాజస్థాన్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మూడు రాష్ట్రాల్లో ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం బీజేపీకి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో గడ్డు పరిస్థితి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏబీపీ న్యూస్‌-సీవోటర్‌ సర్వే ప్రకారం.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలవనుంది. అలాగే 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోనుంది.

రాజస్థాన్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 200 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ పార్టీకి 142, బీజేపీకి 56 సీట్లు దక్కుతాయని సర్వే ద్వారా వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 122 సీట్లు దక్కుతాయని, బీజేపీకి 108 సీట్లు వస్తాయని సర్వే ద్వారా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కి 47, బీజేపీకి 40 సీట్లు వస్తాయి. మిగిలిన సీట్లు ఇతరులు కైవసం చేసుకోనున్నారు.

More Telugu News