Vizag: జపాన్- భారత్ మారిటైం విన్యాసాలు.. విశాఖ తీరానికి జపనీస్ నౌకలు

  • విశాఖ చేరుకున్న కగ, ఇనాజుమ
  • నేతృత్వం వహించనున్న టట్షుయా పుకడా
  • సబ్ మెరైన్‌తో పాటు పి8ఐ హెలికాప్టర్‌లు

జపాన్- భారత్ మారిటైం విన్యాసాల 'జైమెక్స్ 2018'కు విశాఖ మూడోసారి వేదిక కానుంది. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు జపనీస్ మారిటైం సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కి చెందిన నౌకలు కగ, ఇనాజుమ విశాఖలోని తూర్పు నౌకాదళానికి చేరుకున్నాయి. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు జరిగే వివిధ రకాల విన్యాసాలలో భారత్ నౌకలతో పాటు ఇవి పాల్గొంటాయి. రియర్ అడ్మిరల్ టట్షుయా పుకడా నేతృత్వంలో కగ, ఇనాజుమ నౌకలు తమ సామర్ధ్యాలను ప్రదర్శిస్తాయి. ఇవి కాకుండా సబ్ మెరైన్‌తో పాటు పి8ఐ హెలికాప్టర్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి.

భారత్, జపాన్ దేశాల మధ్య పరస్పర సహకారం, యాంటి పైరసీ ఆపరేషన్లలో పరస్పర సమాచార మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి వంటివి ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశం. భారత్ నుంచి దేశీయంగా రూపుదిద్దుకున్న మూడు యుద్ధ నౌకలతో పాటు, ఒక ఫ్లీట్ ట్యాంకర్‌ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటుంది. భారత బృందానికి రియర్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 8 రోజుల విన్యాసాలలో నాలుగు రోజులు హార్బర్, మరో నాలుగు రోజులు సముద్రంపైన జరగనున్నాయి.

More Telugu News