t-bjp: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. నా గెలుపు ఖాయం: బీజేపీ నేత బాబూమోహన్

  • అమ్మ వారి దయతో విజయం సాధిస్తా
  • టీఆర్ఎస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయి
  • విజయవాడ దుర్గమ్మను దర్శించిన బాబూమోహన్

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, తన గెలుపు ఖాయమని బీజేపీ నేత, ప్రముఖ నటుడు బాబూమోహన్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో కనకదుర్గమ్మ వారిని బాబూమోహన్ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని, అమ్మవారి దయతో విజయం సాధిస్తానని అన్నారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడం, వెంటనే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయని విమర్శించారు. కాగా, బాబూమోహన్ తో ఫొటోలు దిగేందుకు ఆలయంలోని భక్తులు ఆసక్తి కనబరిచారు.

More Telugu News