trisha: త్రిష-విజయ్ సేతుపతి సినిమాకు పైరసీ సెగ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విశాల్ టీమ్!

  • చెన్నైలోని మినీ ఉదయం థియేటర్ లో ఘటన
  • సెల్ ఫోన్ లో వీడియో తీసిన ప్రబుద్ధుడు
  • పోలీసులకు అప్పగించిన విశాల్ బృందం

ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ త్రిష జంటగా నటించిన ‘96’ సినిమాకు ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాకు కూడా పైరసీ భూతం తప్పలేదు. ఓ వ్యక్తి దొంగ చాటుగా తన మొబైల్ ఫోన్ తో 96 సినిమాను షూట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ప్రముఖ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పైరసీ భూతాన్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన టీమ్ సభ్యులు ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని నాలుగు తలిగించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన చెన్నైలోని మినీ ఉదయం అనే థియేటర్ లో చోటుచేసుకుంది. తొలుత అతను వీడియో చిత్రీకరిస్తున్న ఫొటోలను ఈ టీమ్ తీసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది. పైరసీ భూతాన్ని అరికట్టడానికి విశాల్ ఓ ప్రత్యేక బృందాన్ని గతంలో నియమించాడు.

More Telugu News