h20: H2O అంటే ఏంటని ప్రశ్నించిన అందాల పోటీ జడ్జి.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన యువతి!

  • బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘటన
  • మిస్ వరల్డ్ బంగ్లాదేశ్ పోటీలో వింత సమాధానం
  • విస్తుపోయిన జడ్జీలు, వీక్షకులు

ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా అందాల పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇందులో విజేతగా నిలిచేందుకు అందంతో పాటు సమయస్ఫూర్తి, తెలివితేటలు కూడా కొంచెం కావాలి. లేదంటే అందరిముందు పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఢాకాలో మిస్ వరల్డ్ బంగ్లాదేశ్-2018 పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న యువతులను షో జడ్జీలు రకరకాల ప్రశ్నలతో పరీక్షించారు. కానీ ఓ యువతి మాత్రం ఈ పోటీలో జడ్జీలకే చుక్కలు చూపింది. ర్యాంప్ వాక్ పూర్తిచేసిన తర్వాత ఓ జడ్జి ‘H2O అంటే ఏమిటి?’ అని అడిగాడు. దీనికి సదరు ముద్దుగుమ్మ.. తొలుత దిక్కులు చూసింది. అనంతరం అది ఢాకాలో పేరున్న రెస్టారెంట్ అని జవాబిచ్చింది. దీంతో బిక్కచిక్కిపోయిన జడ్జి మరింత నష్టం జరగకుండా H2O అంటే నీరు అని కవర్ చేశాడు.

వింతవింత పేర్లతో జనాలను ఆకర్షించేందుకు రెస్టారెంట్లు యత్నించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జనాలు నవ్వుకుంటున్నారు. అన్నట్లు మిస్ వరల్డ్ బంగ్లాదేశ్-2018 పోటీల్లో జెనాతుల్‌ ఫిర్దౌస్‌ ఓయిషి విజేతగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోను మీరూ చూసేయండి.

More Telugu News