Rajasthan: రాజస్థాన్ సీఎం వసుంధర రాజేకు 'వాయిదా' అలా కలిసొచ్చింది!

  • ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వాయిదా అనుకూలించింది
  • రైతులకు ఉచిత విద్యుత్ ప్రకటించిన రాజస్థాన్ సీఎం
  • మూడు గంటలు వాయిదా పడటంతో ‘హామీ’

రాజస్థాన్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ ఈరోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రకటించాల్సిన ఎన్నికల షెడ్యూల్ ను వాయిదా వేసి, మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ ప్రకటించింది. ఈ ప్రకటన దాదాపు మూడు గంటలు వాయిదా పడటం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు కలిసొచ్చింది.

ఎలాగంటే, ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వాయిదా పడటంతో.. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని వసుంధర రాజే ప్రకటించడం జరిగిపోయింది. ఈరోజు మధ్యాహ్నం అజ్మీర్ లో బీజేపీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభకు ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమను అధికారంలోకి తీసుకొస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆమె ప్రకటించడం జరిగింది.

అయితే, ఈసీ ఎన్నికల షెడ్యూల్ కొన్ని గంటల పాటు వాయిదా పడటంపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాజస్థాన్ లో మోదీ ప్రచార ర్యాలీ ఉన్నందునే వాయిదా వేశారా? అని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News