vijay devarakonda: విజయ్ దేవరకొండ వల్ల భారీ ఓపెనింగ్స్!

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'నోటా'
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ 
  • ప్రపంచవ్యాప్తంగా 7.42 కోట్ల షేర్  

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన 'నోటా' చిత్రం .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమా ఆసక్తికరమైన అంచనాల మధ్యనే థియేటర్స్ కి వచ్చింది. సమకాలీన రాజాకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రంపై టాక్ నెగటివ్ గా ఉన్నప్పటికీ, విజయ్ దేవరకొండకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 7 కోట్ల 42 లక్షల షేర్ వచ్చింది. 'గీత గోవిందం' లాంటి లవ్ స్టోరీ తరువాత విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే తనకి రాజకీయాలంటే వున్న ఆసక్తి కారణంగానే ఈ సినిమా చేశానని ఆయన చెప్పాడు.  

More Telugu News