టెస్ట్ సిరీస్.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కూల్చిన టీం ఇండియా!

- స్పిన్ తో కుల్దీప్ మాయాజాలం
- తొలి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే విండీస్ ఆలౌట్
- చెమటోడ్చుతున్న కరేబియన్ ఆటగాళ్లు
దీంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. చైనా మాన్ కుల్దీప్ యాదవ్ స్నిన్ ఉచ్చులో చిక్కుకుని వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు పెవిలియన్ బాట పట్టారు. దీంతో కేవలం 116 పరుగులకే విండిస్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయి పోరాడుతోంది. ప్రస్తుతం పావెల్(66), చేజ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.