sexual herasment: ఐటీ ఉద్యోగి లైంగిక వేధింపులు.. ఇంటికి పంపించిన యాజమాన్యం!

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఘటన
  • వేధింపుల్లో భాగంగా బాధితులకు బెదిరింపులు
  • సామాజిక మాధ్యమాల్లో ఒకరి పోస్టింగ్స్‌తో గుట్టు రట్టు

మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న టాటా కన్సల్టెన్సీ ఉద్యోగి విషయం వెలుగు చూడడంతో ఉద్యోగం కోల్పోయాడు. లైంగిక వేధింపులకు పాల్పడడమే కాక అసభ్యకర సందేశాలు పంపి మీపై అత్యాచారం చేస్తానని, మీ భర్త, పిల్లలను హత్య చేస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. బాధిత మహిళ ఒకరు తెగించి అతని పోస్టింగ్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో గుట్టు రట్టయింది. బంగారంలాంటి ఉద్యోగం ఊడింది.

వివరాల్లోకి వెళితే... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో రాహుల్‌ సింగ్‌ పనిచేస్తున్నాడు. అసోంకు చెందిన ఓ మహిళ ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను ఫేస్‌ బుక్‌లో పెట్టేది. వీటికి స్పందించిన రాహుల్‌ ఆమెతో స్నేహం మొదలు పెట్టాడు. కొన్నాళ్ల తర్వాత అభ్యంతరకర మెసేజ్‌లు పెట్టడం మొదలు పెట్టాడు. తన మాట వినకుంటే రేప్‌ చేస్తానని, చంపుతానని బెదిరించడం చేశాడు. దీంతో సదరు మహిళ రాహుల్‌ సింగ్‌ పంపిన స్క్రీన్‌ షాట్లను ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. అవి వైరల్‌ కావడంతో విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా దర్యాప్తునకు కూడా ఆదేశించింది.

More Telugu News