CBI: రాజకీయాల్లోకి వస్తున్నా.. సంచలన ప్రకటన చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన లక్ష్మీ నారాయణ
  • ప్రతి వర్గానికీ నిర్దిష్టమైన పాలసీ
  • గ్రామీణుల సమస్యలు తీర్చేందుకు కృషి
  • యువతకు ఉపాధి కల్పిస్తానన్న లక్ష్మీ నారాయణ

తాను చేస్తున్న ఉద్యోగాన్ని స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా వదులుకుని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకంటూ, ఇంతకాలం జిల్లాలు పర్యటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఈ ఉదయం ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతి వర్గానికీ నిర్దిష్టమైన పాలసీని తాను రూపొందించానని, దాని అమలు దిశగా కృషి చేస్తానని అన్నారు.

రైతులు, గ్రామీణ ప్రజల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయని, వాటిపై పోరాడుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి కల్పన, అణగారిన వర్గాలకు చేయూతను అందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తానని లక్ష్మీ నారాయణ వెల్లడించారు. ఇతర పార్టీలతో పొత్తులపై ఇప్పుడే ఏమీ ఆలోచించడం లేదని, అందుకు చాలా సమయం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

More Telugu News