india: భారత్- రష్యా మధ్య కుదిరిన 8 ఒప్పందాలు

  • భారత్- రష్యా 19వ వార్షిక శిఖరాగ్ర ద్వైపాక్షిక సదస్సు
  • ఈ సదస్సులో పాల్గొన్న మోదీ-పుతిన్
  • రక్షణ, అణుశక్తి సహా పలు రంగాల్లో ఒప్పందాలు

భారత్- రష్యా దేశాల మధ్య ఢిల్లీలో ఈ రోజు జరిగిన 19వ వార్షిక శిఖరాగ్ర ద్వైపాక్షిక సదస్సులో ఎనిమిది ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. రక్షణ, అణుశక్తి, అంతరిక్షం, రైల్వే సహా పలు రంగాలకు సంబంధించి దాదాపు ఎనిమిది ఒప్పందాలు జరిగాయి.

ఈ ఒప్పందాల ప్రకారం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘గగన్ యాన్’ కు రష్యా సహకారం అందిస్తుంది. అలాగే రష్యా నుంచి ఎస్-400 క్షిపణులను భారత్ కొనుగోలు చేయనుంది. ‘గగన్ యాన్’కు సంబంధించి ఇస్రో, ది ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ రష్యా కలిసి పనిచేసేలా ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై రెండు దేశాలు కలసికట్టుగా పోరాడాలని నిర్ణయించినట్టు ద్వైపాక్షిక సదస్సు అనంతరం ఇరుదేశాధినేతలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న భారత్‌ కు వచ్చారు.

More Telugu News