RBI: కీలక నిర్ణయాలేవీ తీసుకోని ఆర్‌బీఐ.. వడ్డీరేట్లు యథాతథం

  • ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో సమీక్ష
  • వడ్డీ రేట్లను పెంచాలన్న చేతన్
  • పూర్వ స్థితిని కొనసాగించాలన్న మెజారిటీ సభ్యులు

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలో నేడు ఆర్‌బీఐ నిర్వహించిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోలేదు. వడ్డీ రేటును పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేసినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ దాని జోలికి వెళ్లలేదు.

ఆరుగురు సభ్యుల కమిటీలో చేతన్ ఘాటీ వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచాలని ప్రతిపాదించారు. కానీ మిగతా ఐదుగురు యథాతథ స్థితిని కొనసాగించేందుకు మొగ్గు చూపారు. దీంతో ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతం రెపో రేటు 6.5 శాతం వద్ద ఉండగా, రివర్స్‌ రెపో రేటు 6.25గానే ఉంది. ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్‌ డ్యూటీ ద్రవ్యోల్బణం అదుపునకు సహకరిస్తుందని ఉర్జిత్‌ పటేల్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

More Telugu News