కేసీఆర్ కు నోటి దురద ఎక్కువైంది: ఆదినారాయణ రెడ్డి

05-10-2018 Fri 17:11
  • కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది
  • వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం కేసీఆర్ నైజం
  • ఎదురు మాట్లాడిన వారిపై ఐటీ దాడులు చేయించడం బీజేపీ ఆనవాయతీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. నోటి దురద ఎక్కువై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వ్యక్తులను కించపరిచేలా మాట్లాడటం కేసీఆర్ నైజమని చెప్పారు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కు చంద్రబాబుకు ఉందని అన్నారు. ఎదురు మాట్లాడిన వారిపై ఐటీ దాడులు చేయించడం బీజేపీ ఆనవాయతీ అని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు.