కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి: డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్

05-10-2018 Fri 14:33
  • చంద్రబాబుపై కేసీఆర్ వాడిన భాష అసహ్యం కలిగిస్తోంది 
  • జగన్, పవన్ ఎందుకు నోరు మెదపరు?: డొక్కా
  • చంద్రబాబుపై మహాకుట్ర జరుగుతోంది: బుద్దా
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న చేసిన తీవ్ర వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఏపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై కేసీఆర్ వాడిన భాష అసహ్యం కలిగిస్తోందని విమర్శించారు. ఏడు మండలాల విలీనం విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై, జగన్, పవన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.  

ఏపీని అధోగతి పాల్జేసేందుకు కుట్ర 

టీడీపీకి చెందిన మరో నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ, చంద్రబాబుపై మహా కుట్ర జరుగుతోందని, కేసీఆర్, పవన్, జగన్ మోదీతో భాగస్వాములయ్యారని అన్నారు. ఏపీని అధోగతి పాల్జేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.