nota: సినిమాకు ‘నోటా’ అనే పేరు ఎందుకు పెట్టామంటే.. స్పందించిన విజయ్ దేవరకొండ!

  • ఈవీఎంలకు సినిమా టైటిల్ తో సంబంధం లేదు
  • ఇది ఓ సాధారణ యువకుడి కథ
  • తెలుగు, తమిళ పరిస్థితులకు తగ్గట్లు కథను మార్చామని వెల్లడి

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ సినిమా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్నివర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అసలు సినిమాకు ’నోటా’ అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందో విజయ్ వివరించాడు.

అసలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లోని నోటా బటన్ కు, సినిమా పేరుకు సంబంధం లేదని విజయ్ దేవరకొండ తెలిపాడు. ‘ఇప్పటి నాయకులు సరిగా లేరు. మాకు ప్రత్యామ్నాయం కావాలి’ అన్న విషయాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చూపామన్నారు. ఏపీ, తెలంగాణలో ఓ మామూలు కుర్రాడిని తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీ చేయమని రంగంలోకి దించితే ఈ వ్యవస్థపై ఎలా ప్రతిస్పందించాడన్నదే ఈ సినిమాలో తన పాత్ర అని దేవరకొండ వెల్లడించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాజకీయ పరిస్థితులకు తగ్గట్లు కథలో మార్పులు చేశాడని పేర్కొన్నారు.

నోటా సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్యామ్ సీఎస్ సంగీతం సమాకూర్చారు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మెహ్రీన్ ఫిర్జాదా నటించింది. ఇక నాజర్, ప్రియదర్శి, సత్యరాజ్ లు సినిమాలో కీలకపాత్రల్లో నటించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేజీ జ్ఞానవేల్ రాజా నోటా సినిమాను నిర్మించారు.

More Telugu News