mcafee: ఇలియానా 'సెలబ్రిటి' క్రేజ్ అటువంటిది!

  • హ్యాకర్లు ఇలియానా పేరును ఎక్కువగా వాడారు
  • భద్రతను కూడా పక్కనబెడుతుంటారు
  • వినియోగదారులు ఆలోచించాలి

సినిమాలలో అవకాశాలు తగ్గినా గోవా బ్యూటీ ఇలియానాకున్న క్రేజ్ మాత్రం తగ్గలేదనడానికి నిదర్శనం ఇది. ఈ చిన్నది తాజాగా ‘అత్యంత సంచలనాత్మక సెలబ్రిటి' (మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటి)గా స్థానాన్ని సొంతం చేసుకుంది. అమెరికన్‌ గ్లోబల్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహించిన ‘అత్యంత సంచలనాత్మక సెలబ్రిటీ’ సర్వే ప్రకారం హ్యాకర్లు నెటిజన్లను మభ్యపెట్టి తప్పుడు వెబ్‌సైట్లు క్లిక్‌ చేసేందుకు ఇలియానా పేరును ఎక్కువగా ఉపయోగించారని తేలింది. ఇప్పటి వరకూ సైబర్ స్పేస్ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న కపిల్ శర్మను దాటేసుకుని మరీ వెళ్లి ఇలియానా మొదటి స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా McAfee ప్రతినిధి వెంకట్‌ కృష్ణాపూర్‌ మాట్లాడుతూ, ‘‘సెలబ్రిటీలకు, చిత్ర పరిశ్రమకు చెందిన వారికి క్రేజ్ బాగా వుంటుంది. అభిమానులు తమకు ఇష్టమైన వారికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే మాధ్యమాలను కనెక్ట్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అభిమానులు కొన్నిసార్లు భద్రతను కూడా పక్కన పెట్టి వ్యవహరిస్తుంటారు. దీన్ని సైబర్‌ నేరస్థులు అవకాశంగా తీసుకుంటారు. తప్పుడు ఐడీలు పెట్టి.. సమాచారం దొంగలించేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వినియోగదారులు సినిమాలు, సెలబ్రిటీలు, టీవీ షోలు, ఫొటోలు అని వచ్చే లింక్‌లను క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి’ అని చెప్పారు. 

More Telugu News