Supreme Court: రోహింగ్యాల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

  • 2012 నుంచి అసోంలో అక్రమ నివాసం
  • మయన్మార్ పంపేయాలని నిర్ణయం
  • సుప్రీంకోర్టులో నిన్న పిటీషన్ దాఖలు

మయన్మార్ కు చెందిన ఏడుగురు రోహింగ్యా శరణార్థులు 2012 నుంచి అసోంలో అక్రమంగా నివాసముంటున్నారు. వీరివద్ద ఎలాంటి నివాస గుర్తింపు లేని కారణంగా తిరిగి వీరిని స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం వీరిని మణిపూర్‌లోని మోరె సరిహద్దు వద్ద సంబంధిత అధికారులకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

అయితే, దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నిన్న పిటీషన్ దాఖలైంది. అత్యవసర విచారణ కింద ఈ పిటీషన్‌పై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఏడుగురు రోహింగ్యా శరణార్థులను తిరిగి వారి మాతృదేశానికి పంపించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్‌ను తోసిపుచ్చింది. రోహింగ్యాల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది.

More Telugu News