sensex: రూపాయి దెబ్బకు విలవిల్లాడిన మార్కెట్లు.. భారీ పతనం

  • దలాల్ స్ట్రీట్ లో బ్లడ్ బాత్
  • కుప్పకూలిన మార్కెట్లు
  • 806 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, అమెరికా డాలరు మారకంతో పతనమౌతున్న రూపాయి విలువ దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆచితూచి వ్యవహరిస్తున్న ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో... మార్కెట్లు ఈరోజు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఐటీ, ఆటో, ఫార్మా, రియాల్టీ స్టాకులు ఎక్కువ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 806 పాయింట్లు కోల్పోయి 35,169కి పడిపోయింది. నిఫ్టీ 259 పాయింట్లు పతనమై 10,599కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జెట్ ఎయిర్ వేస్ (11.04%), స్పైస్ జెట్ (8.85%), ఎన్ఎల్సీ ఇండియా (6.78%), ఫీనిక్స్ మిల్స్ (5.49%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (4.98%).

టాప్ లూజర్స్:
ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (-17.64%), హిందుస్థాన్ పెట్రోలియం (-12.23%), భారత్ పెట్రోలియం (-10.89%), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (-10.57%), సెంట్రల్ బ్యాంక్ (-9.91%).

More Telugu News