Panasonic: వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ తో పానసోనిక్ నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదల!

  • రెండు స్మార్ట్ ఫోన్ లని విడుదల చేసిన పానసోనిక్
  • పానసోనిక్ ఎలూగా ఎక్స్ 1 ప్రో ధర రూ.27,000
  • పానసోనిక్ ఎలూగా ఎక్స్ 1 ధర రూ.23,000

నాలుగు నెలల అనంతరం జపాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు సంస్థ పానసోనిక్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. 'పానసోనిక్ ఎలూగా ఎక్స్ 1', 'పానసోనిక్ ఎలూగా ఎక్స్ 1 ప్రో' పేరిట విడుదలైన ఈ రెండు ఫోన్లలో 6.18 అంగుళాల టచ్ స్క్రీన్, మీడియా టేక్ హీలియో పీ60 చిప్ సెట్ తో పాటు వెనక భాగంలో 16/5 మెగాపిక్సెల్ గల రెండు కెమెరాలని ఏర్పాటు చేశారు. అలాగే వీటిలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 

'ఎలూగా ఎక్స్ 1 ప్రో'లో అదనంగా వైర్ లెస్ ఛార్జింగ్ లాంటి మరో ఫీచర్ కలిగి ఉండటం విశేషం. సిల్వర్, గ్రే కలర్లలో లభించే ఈ ఫోన్లు ఈ నెల 10 నుండి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫీచర్ గల 'పానసోనిక్ ఎలూగా ఎక్స్ 1 ప్రో' ఫోన్ ధర రూ. 27,000 ఉండగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల 'పానసోనిక్ ఎలూగా ఎక్స్ 1' ఫోన్ ధర రూ. 23,000గా ఉంది. కాగా, ఈ రెండింటిలో కూడా 3000 ఎంఏహెచ్ బ్యాటరీని సపోర్ట్ చేస్తుంది.

More Telugu News