Kajal Agarwal: కొండచిలువతో సాహసం చేసిన కాజల్ అగర్వాల్.. వీడియో చూడండి

  • బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
  • థాయ్ లాండ్ లో చిత్రీకరణ
  • షూటింగ్ లో భాగంగా కొండచిలువను మెడలో వేసుకున్న కాజల్

తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా ఓ చిత్రం ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం థాయ్ లాండ్ లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా షూటింగ్ లో భాగంగా కాజల్ ఓ సాహసం చేసింది. ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకుంది. కొండచిలువను పట్టుకున్న తర్వాత కాజల్ తొలుత చాలా భయపడిపోయింది. కానీ, పక్కనే ఉన్న పర్యవేక్షకులు ధైర్యం చెప్పడంతో ఆమె ఆ షాట్ ను పూర్తి చేయగలిగింది. ఈ వీడియోను కాజల్, తేజలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

More Telugu News