Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ను దేశానికే స్పోర్ట్స్ హబ్ గా మారుస్తాం!: మంత్రి కొల్లు రవీంద్ర

  • ఏపీలో మౌలికాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం
  • రూ.175 కోట్లతో బీఆర్ స్టేడియం ఆధునికీకరణ
  • ప్రారంభమైన అండర్-13 బ్యాడ్మింటన్ పోటీలు

ఆంధ్రప్రదేశ్ ను దేశానికే స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీ యువత జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. క్రీడల్లో రాణించాలంటే ఆరోగ్యమైన ఆహారంతో పాటు మంచి పరిసరాలు కూడా అవసరమని వ్యాఖ్యానించారు. ఈ రోజు గుంటూరులో ఆలిండియా అండర్-13 బ్యాడ్మింటన్ పోటీలను రవీంద్ర ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నవ్యాంధ్రను త్వరలోనే దేశంలో అత్యుత్తమ క్రీడా హబ్ గా మారుస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో స్పోర్ట్స్ సిటీలను నిర్మిస్తున్నామని తెలిపారు. గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి (బీఆర్) స్టేడియాన్ని రూ.175 కోట్లతో ఆధునికీకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం గుంటూరులో ప్రారంభమైన ఆలిండియా అండర్-13 బ్యాడ్మింటన్ పోటీల్లో 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

More Telugu News