India: పృధ్వీషా అరుదైన రికార్డు... తొలి టెస్టులోనే 100 బాల్స్ లోపే సెంచరీ!

  • అదరగొడుతున్న పృధ్వీ షా
  • అండగా నిలిచిన శిఖర్ ధావన్
  • భారీ స్కోరు దిశగా భారత్

నేడు రాజ్ కోట్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన పృధ్వీషా, అంచనాలను మించి అదరగొట్టాడు. తాను ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీ సాధించాడు. అది కూడా 100 బంతులలోపే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి టెస్టును ఆడుతూ, 100 బంతుల్లోపే సెంచరీ సాధించింది ఇంతవరకూ ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే.

 గతంలో వెస్టిండీస్ కు చెందిన డ్వేన్ స్మిత్ తన అరంగేట్రంలో 93 బంతుల్లో సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ తానాడిన మొదటి మ్యాచ్ లో 85 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. వీరిద్దరి సరసనా ఇప్పుడు పృధ్వీ షా నిలిచాడు. షా ఈ మ్యాచ్ లో 99 బంతుల్లో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 174 పరుగులు. కాగా, పుజారా 67 పరుగులతో మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది. 

More Telugu News