Sri Lanka: శ్రీలంకలో పెద్ద ఎత్తున బయటపడ్డ అస్థిపంజరాలు

  • 150కి పైగా అస్థిపంజరాలు 
  • అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారివిగా అనుమానం
  • మన్నార్ జిల్లాలో బయటపడ్డ అస్థిపంజరాలు

శ్రీలంకలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న మన్నార్ జిల్లాలో అస్థిపంజరాలు కుప్పలుతెప్పలుగా బయటపడటం కలకలం రేపుతోంది. 150కి పైగా అస్థిపంజరాలను కనుగొన్నట్టు శ్రీలంక అధికారులు తెలిపారు. మన్నార్ మేజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి ఓ గదిని నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. పాత కోఆపరేటివ్ స్టోర్ స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు తవ్వకాలను చేపట్టగా... ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. 1983 నుంచి 2009 మధ్య కాలంలో ఈ ప్రాంతం ఎల్టీటీఈ అధీనంలో ఉంది. 30 ఏళ్ల క్రితం జరిగిన అంతర్యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్న వారి అస్థిపంజరాలుగా వీటిని భావిస్తున్నారు. 1990లో దాదాపు 25వేల మంది కనిపించకుండా పోయారనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. 

More Telugu News