ఆదిలోనే ఎదురుదెబ్బ... తొలి ఓవర్ లోనే కేఎల్ రాహుల్ డక్కౌట్!

04-10-2018 Thu 09:43
  • నాలుగు బంతులాడి వెనుదిరిగిన రాహుల్
  • టెస్టు క్రికెట్ లో పరుగుల వేట ప్రారంభించిన పృధ్వీ షా
  • రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు

కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన భారత్ - వెస్టిండీస్ తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ నాలుగు బంతులాడి డక్కౌట్ గా పెవీలియన్ చేరాడు. బ్యాటింగ్ ప్రారంభించిన పృధ్వీషా, తానాడిన రెండో బంతికి టెస్టు కెరీర్ లో పరుగుల వేటను ప్రారంభించాడు. బౌండరీ దిశగా దూసుకెళుతున్న బంతిని వెస్టిండీస్ ఆటగాడు కీమో పాల్ ఆపగా, ఈలోగా మూడు పరుగులు వచ్చాయి. ఆపై నాలుగు బంతులాడిన రాహుల్ గాబ్రియేల్ బౌలింగ్ లో అరెస్టయ్యాడు. దీంతో తొలి ఓవర్ లోనే భారత్ తన తొలి వికెట్ ను చేజార్చుకుంది. ప్రస్తుతం భారత స్కోరు రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు.