gold: భారీగా పెరిగిన బంగారం ధర!

  • రూ.32వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర
  • బంగారం బాటలోనే పెరిగిన వెండి ధర
  • వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండ్

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే రూ.500 పైగా పెరిగి 10 గ్రాముల బంగారం ధర రూ.32 వేలు దాటగా, వెండి కూడా అదే బాటలో పెరిగింది. స్వచ్ఛమైన బంగారం నేటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాములకు రూ.555 పెరిగి రూ.32,030కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ.450 పెరిగి రూ.39,400కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిణామాలతో పాటు వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధర బాగా పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.32 శాతం పెరిగి 1207 డాలర్లుగా ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు మరింతగా పడిపోయిన కారణంగా ఆ ప్రభావం బంగారం ధరపై పడినట్టు బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More Telugu News