kcr: పేదల పింఛన్లు మళ్లీ పెంచుతాం: సీఎం కేసీఆర్

  • గులాబీ జెండా గుండెల్లో పెట్టుకున్న జిల్లా నిజామాబాద్
  • పింఛన్ ఎంతో మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుంది
  • కేసీఆరే మా పెద్ద కుమారుడని ఆశీర్వదిస్తున్నారు

గులాబీ జెండా గుండెల్లో పెట్టుకున్న జిల్లా నిజామాబాద్ అని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నఆయన మాట్లాడుతూ, ఈరోజు చూసిన జన ప్రభంజనంను తాను ఏనాడూ చూడలేదని, కేసీఆరే మా పెద్ద కుమారుడని ప్రతి ఇంట్లో ఆశీర్వదిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో ఉన్న రూ.200 పింఛన్ ను రూ.1000కి పెంచిన ఘనత తమదేనని, పేదల పింఛన్ లను మళ్లీ పెంచుతామని, పింఛన్ ఎంతో మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. రాబోయే మూడు నెలలలో ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు తమకు అధికారమిచ్చారని, తమ పాలనలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, నీటి తీరువా రద్దు చేసిన ఏకైక రాష్ట్రం ‘తెలంగాణ’ అని చెప్పారు. గత పాలకుల హయాంలో రాష్ట్రంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని టీడీపీ, కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.

More Telugu News