ys jagan: మహిళా కానిస్టేబుళ్లకు వైఎస్ జగన్ కీలక హామీ!

  • విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న యాత్ర
  • ప్రతిపక్ష నేతను కలుసుకున్న మహిళా పోలీసులు
  • అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు యాత్రలో భాగంగా జగన్ నెల్లిమర్ల నియోజకవర్గంలోని కొండవెలగాడ నుంచి 277వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా వేర్వేరు వర్గాలను కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. జరజాపుపేట, లక్ష్మీదేవిపేట మీదుగా నెల్లిమర్ల మెయిదా జంక్షన్ వద్దకు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.

కాగా, ఈ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మహిళా కానిస్టేబుళ్లు ప్రతిపక్ష నేతను కలుసుకున్నారు. విధుల నిర్వహణ సందర్భంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకున్నారు. కనీసం వారాంతపు సెలవులు కూడా లేకుండా, అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తోందని వాపోయారు. అన్నింటిని సావధానంగా విన్న జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ప్రకటించారు. అలాగే పోలీస్ స్టేషన్లలో మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Telugu News