Revanth Reddy: రేవంత్‌రెడ్డిని విచారిస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు

  • బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి హాజరైన రేవంత్‌
  • ఓటుకు నోటు కేసుపై ఆరా తీసే అవకాశం
  • మరోసారి హాజరు కానున్న ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌

మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆదాయపన్ను శాఖ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.  ఆ శాఖ అధికారుల పిలుపు మేరకు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి రేవంత్‌ ఉదయం చేరుకోగా పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెలుగు చూసిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన అంశాలపై అధికారులు కూపీలాగే అవకాశం ఉంది.

ఇప్పటికే రేవంత్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాంక్‌ల్లోని ఆయన లాకర్లు కూడా తెరిపించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డాక్యుమెంట్లు, లభించిన ఆధారాల మేరకు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. ఐటీ అధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరైన ఉదయ్‌సింహా, సెబాస్టియన్లను కూడా మంగళవారం అధికారులు మరోసారి విచారించే అవకాశం ఉంది.

More Telugu News