virat kohli: ధోని సలహాలు నా ఆటను మరోస్థాయికి తీసుకెళ్లాయి: సిరాజ్

  • టీ 20కి ఎంపికైన అనతి కాలంలోనే టెస్టులకు ఎంపిక
  • ప్రయోగాలు చెయ్యొద్దని కోహ్లీ సూచించాడు
  • నాలో ఒత్తిడి మాయం చేశాడు

టీ 20కి ఎంపికైన కొద్ది కాలానికే టెస్టులకు కూడా ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్ సిరాజ్ ఇప్పుడు మరింత ఉత్సాహంగా వున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ మ్యాచ్ లో తన అరంగేట్రం గురించి; కోహ్లీ, ధోనీ ఇచ్చిన సలహాల గురించి హైదరాబాదీ యువకుడు మహ్మద్ సిరాజ్ తాజాగా చెప్పుకొచ్చాడు.

‘గతేడాది న్యూజిలాండ్‌తో టీ20కి ఎంపికయ్యాను. కోహ్లీ భాయ్‌తో మాట్లాడా. చాలా నెర్వస్‌ అయ్యా. అప్పుడు 'ఆందోళన పడకు. మైదానంలోకి వెళ్లాక మాట్లాడుకుందాం. నీ అరంగేట్రం మ్యాచ్‌కు సిద్ధమవ్వు' అన్నాడు కోహ్లీ. మైదానంలోకి వెళ్లాక నా ఆట చూశానని చెప్పాడు. సహజ శైలిలోలోనే ఆడమని, ప్రయోగాలు చేయవద్దని సూచించాడు. నాలో ఒత్తిడి మాయం చేశాడు. కేన్‌ విలియమ్సన్‌ వికెట్‌ తీయడంతో ఖుషీ అయ్యాడు’ అని సిరాజ్‌ తెలిపాడు.

ఇక ధోనీ గురించి మాట్లాడుతూ ఆయన సలహాలు తన ఆటను మరోస్థాయికి తీసుకెళ్లాయని చెప్పాడు. ‘బ్యాట్స్‌మెన్‌ ఫుట్‌వర్క్‌ను శ్రద్ధగా గమనించు. తర్వాత అందుకు తగ్గట్టుగా లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మార్చు అని ధోనీ సలహా ఇచ్చాడు. అది నా ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది’ అని సిరాజ్‌ తెలిపాడు. భారత్‌-ఏ తరఫున ఆస్ట్రేలియా-ఏ, దక్షిణాఫ్రికా-ఏ జట్లపై అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్టర్ల బృందం వెస్టిండీస్‌ సిరీస్‌కు ఎంపిక చేసింది.

More Telugu News