rape: జాతకంలో దోషం ఉందని నాలుగేళ్లుగా అత్యాచారం చేసిన మేనమామ

  • పెళ్లయిన తర్వాత కూడా బాధితురాలిపై వేధింపులు 
  • భర్తకు విషయాన్ని తెలిపిన బాధితురాలు
  • దోష నివారణ కోసమే ఈ పని చేశానన్న మేనమామ

జాతకంలో దోషం ఉందని, ఇలాగే ఉంటే పెళ్లి కాదని, తండ్రి కూడా చనిపోతాడని భయపెట్టి మేనకోడలిపై నాలుగేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మేనమామ. ఈ దారుణం ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జాతకాన్ని ఎరగా చూపి మేనకోడలు (23)ను మేనమామ లొంగదీసుకున్నాడు. ఇటీవలే ఆమెకు పెళ్లయింది. అయినప్పటికీ తన కోరికను తీర్చాలంటూ ఆమెను వేధించాడు. దీంతో ఆ విషయాన్ని తన భర్తకు చెప్పిందామె.

ఈ నేపథ్యంలో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మేనమామను అరెస్ట్ చేశారు. తన మేనకోడలి జాతకంలో దోషం ఉందని, దోష నివారణ కోసమే తాను ఈ పని చేశానని పోలీసులతో కూడా నిందితుడు చెప్పడం గమనార్హం. మూఢ నమ్మకాలను నమ్మి, మోసపోయిన ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.

More Telugu News