Jagan: జగన్ పాదయాత్రలో పాల్గొన్న 9 మంది టీచర్లు.. సస్పెండ్ చేసిన విద్యాశాఖాధికారి!

  • ఆదివారం నాడు యాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయులు
  • జగన్ ను సీఎం చేస్తామని నినాదాలు 
  • సస్పెండ్ చేస్తూ విద్యాశాఖాధికారి ఉత్తర్వులు

రెండు రోజుల క్రితం ఆదివారం నాడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న నేరానికి తొమ్మిది మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్ కు గురయ్యారు. యాత్రలో పాల్గొన్న 9 మందినీ సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు వెలువరించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

తాను ముఖ్యమంత్రిని అయితే, నెలరోజుల్లోనే కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, వీరంతా ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వీరంతా జగన్ ను సీఎం చేసేందుకు కలసి పని చేస్తామని నినాదాలు చేసినట్టు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన లింగేశ్వరరెడ్డి, బీమిలి, అనంతగిరి, ఆనందపురం మండలాలకు చెందిన ఉపాధ్యాయులను విధుల నుంచి తప్పించారు. గవర్నమెంట్ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందునే వీరిపై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.

More Telugu News