jagan: గేట్లు ఎత్తి ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్టు చెప్పుకుంటున్నారు: చంద్రబాబుపై జగన్ విమర్శలు

  • వైయస్ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తైంది
  • విషజ్వరాల వల్ల విజయనగరం జిల్లాలో 86 మంది చనిపోయారు
  • భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు బినామీలకు భూములున్నాయి

విజయనగరం జిల్లా అభివృద్ధి రివర్స్ గేర్ లో నడుస్తోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. జిల్లాకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. జిల్లాలో ఎనిమిది జూట్ మిల్లులు ఉంటే చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు మిల్లులు మూతపడ్డాయని అన్నారు. విజయనగరంలోని మూడు లాంతర్ల జంక్షన్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ జగన్ ఈ మేరకు విమర్శించారు. వైయస్ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని... చంద్రబాబు ఇప్పుడు గేట్లు ఎత్తి ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.

విషజ్వరాలు, డెంగ్యూ వచ్చి విజయనగరం జిల్లాలో 86 మంది చనిపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అంబులెన్స్ లు మూలనపడ్డాయని అన్నారు. 108 సిబ్బందికి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు బినామీలకు భూములున్నాయని ఆరోపించారు. ప్రజాయాత్ర ద్వారా ఎన్నో సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. 

More Telugu News