Mumbai: ఢిల్లీ నుంచి ముంబై, కోల్ కతా నగరాలకు జంబో విమానాలు!

  • పండుగ సీజన్ సందర్భంగా ఎయిర్ ఇండియా నిర్ణయం
  • మొదటి దశలో కోల్ కత్తా, రెండు దశలో ముంబైకి 
  • విమానంలో 423 సీట్లు

  దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎయిర్ ఇండియా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా  రద్దీ ఎక్కువగా ఉండే ముంబై, కోల్ కతా నగరాలకు డబుల్ డెక్కర్ విమానాలను నడపాలని నిర్ణయించింది.  ఈ నెల 16 నుంచి 21 వరకు ఢిల్లీ నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోజుకు ఓ విమానాన్ని నడుపనున్నారు.  

423 సీట్ల సామర్థ్యమున్న బోయింగ్‌ 747 డబుల్‌ డెక్కర్‌ విమానంలో 12 ఫస్ట్‌ క్లాస్‌, 26 బిజినెస్‌, 385 ఎకానమీ సీట్లు ఉన్నాయి. మొదటి దశలో భాగంగా కోల్‌కతాకు ఈ డబుల్‌ డెక్కర్‌ విమానాన్ని నడపనుండగా, రెండో దశ (నవంబరు)లో ముంబైకి సేవలు అందించనుంది. నాలుగు ఇంజిన్లతో ఉండే ఈ విమానాలను సాధారణంగా వీవీఐపీల అంతర్జాతీయ పర్యటనలకు ఉపయోగిస్తుంటారు. నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు ఢిల్లీ-ముంబయి-ఢిల్లీ సెక్టార్‌లో రోజుకు రెండు జంబో విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

More Telugu News