USA: అంగారకుడి మట్టి తయారీ.. కిలోల చొప్పున విక్రయం!

  • కృత్రిమ అంగారకుడి మట్టి తయారు 
  • రేటు కిలో రూ. 1450 మాత్రమే
  • భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుందని శాస్త్రవేత్తలు ఆశాభావం

అంగారకుడిపై ఆహారాన్ని పండించే మార్గాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ముందుగా ఇక్కడ అంగారకుడిపై ఉండే మట్టిని కృత్రిమంగా రూపొందించారు. ఈ మట్టికి వారు సిమ్యులెంట్ గా నామకరణం చేశారు. అమెరికాలోని సెంట్రల్‌ ఫ్లోరిడా వర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ ప్రత్యేక పద్ధతి ద్వారా ఈ మట్టిని రూపొందించారు.

అంగారకుడిపైకి నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ రోవర్‌ సేకరించిన మట్టిలోని రసాయన లక్షణాల ఆధారంగా సిమ్యులెంట్‌ను తయారు చేశారు. అరుణ గ్రహంపై ఆహారాన్ని పండించే మార్గాలపై జరిపే పరిశోధనలకు.. ఈ మట్టి ఎంతగానో తోడ్పడుతుందని పరిశోధకుడు డాన్‌ బ్రిట్‌ అన్నారు. భవిష్యత్ లో అంగారకుడిపై మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటే.. ఆహారం, నీరు, ఇతరత్రా నిత్యావసరాలు అవసరమని పేర్కొన్నారు. తాము రూపొందించిన సిమ్యులెంట్‌తో.. అలాంటి మార్గాలను ఇక్కడే పరీక్షించే వీలు చిక్కుతుందని చెప్పారు. మరోవైపు కిలో రూ.1450 చొప్పున ఈ మట్టిని కావలసిన వారికి సరఫరా కూడా చేస్తున్నామని తెలిపారు. 

More Telugu News