Madhya Pradesh: ఇండోర్ తో తీవ్ర కలకలం... 50 లక్షల మందిని చంపగల విషపూరితాలు స్వాధీనం!

  • అమెరికాపై పగ పెంచుకున్న వ్యాపారి
  • వారం రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్
  • 9 కిలోల సింథటిక్ ఓపియాయిడ్, ఫెంటానిల్ స్వాధీనం

దాదాపు 40 నుంచి 50 లక్షల మంది ప్రాణాలను హరించగల అత్యంత విషపూరిత రసాయనాలను ఇండోర్ లో పోలీసులు, డీఆర్డీఓ సైంటిస్టులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడిలో పట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు వారం రోజుల పాటు ఆపరేషన్ జరిపిన అధికారులు 9 కిలోల సింథటిక్ ఓపియాయిడ్, ఫెంటానిల్ ను సీజ్ చేశారు. ఇండియాలో ఫెంటానిల్ పట్టుబడటం ఇదే తొలిసారని తెలుస్తోంది.

ఇండోర్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వ్యాపారి, అమెరికాపై కక్షను పెంచుకుని, ఈ రసాయనాలను తయారు చేసినట్టు తెలుస్తోంది. రసాయన యుద్ధంలో దీన్ని వినియోగిస్తే, కోట్లాది మంది అనారోగ్యం బారినపడివుండేవారని, ఈ కేసులో ఓ మెక్సికన్ జాతీయుడిని కూడా అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.

కాగా, హెరాయిన్ తో పోలిస్తే 50 రెట్ల అధిక విషపూరితమైన ఫెంటానిల్ ను వాసన చూసినా కూడా ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని డీఆర్ఐ డైరెక్టర్ జనరల్ డీపీ దాస్ వెల్లడించారు. ఎంతో నైపుణ్యవంతులైతేనే దీన్ని తయారు చేయగలుగుతారని, దీన్ని తయారు చేసిన వ్యాపారి కెమిస్ట్రీలో పీహెచ్డీ కూడా చేస్తున్నాడని తెలిపారు. కాగా, ఫెంటానిల్ పై గతంలో అలిస్టెర్ మెక్ లీన్ 'సాతాన్ బగ్' అనే చిత్రాన్ని నిర్మించారు. రెండు మిల్లీగ్రాముల ఫెంటానిల్ ఓ మనిషిని చంపగలిగేంత విషమపూరితమైనది.

More Telugu News