kangana: వీరనారి 'మణికర్ణిక' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • 'మణికర్ణిక'పై పెరుగుతోన్న ఆసక్తి 
  • అక్టోబర్ 2వ తేదీన టీజర్ రిలీజ్ 
  • జనవరి 25వ తేదీన సినిమా      

'ఝాన్సీ లక్ష్మీబాయి' జీవితచరిత్ర 'మణికర్ణిక' పేరుతో రూపొందుతోంది. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమా నుంచి వరుసగా పోస్టర్స్ వదులుతున్నారు. కొంతవరకూ క్రిష్ దర్శకత్వం వహించగా, ప్రస్తుతం కంగనాయే దర్శకురాలిగా వ్యవహరిస్తోంది. దర్శకత్వ బాధ్యతలు ఆమెనే స్వీకరించడంతో, ఈ ప్రాజెక్టుపై మరింతగా ఆసక్తి పెరిగింది.

అత్యధిక బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. గాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, అక్టోబర్ 2వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం. శంకర్ .. ఎహసాన్ .. లాయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.       

More Telugu News