Election commission: నేతలకు భారీ షాకిచ్చిన ఎన్నికల సంఘం.. అభ్యర్థులు తమ నేర చరిత్రను కూడా ప్రచారం చేయాల్సిందే!

  • అభ్యర్థులు తమపై ఉన్న కేసుల గురించీ ప్రజలకు తెలపాలి
  • తాము ఓటేసే అభ్యర్థి ఎటువంటి వాడో ప్రజలకు తెలియాలి
  • సుప్రీం తీర్పును అమలు చేయాలంటూ ఈసీ ఆదేశాలు

ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ షాకిచ్చింది. సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిర్ణయించింది. తాము ఓట్లు వేసి గెలిపించబోయే అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని, అందుకోసం అభ్యర్థులు తమపై ఉన్న కేసుల గురించి కూడా వారికి తెలియజేయాల్సి ఉంటుందని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును అభ్యర్థులందరూ తప్పక పాటించాల్సిందేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తేల్చి చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలంటూ అన్ని సెక్రటేరియట్లకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. అభ్యర్థులు తమ నేర చరిత్రను ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిందేనని స్పష్టం చేశారు.  

అభ్యర్థుల నేర చరిత్రపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు చెప్పింది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన తర్వాత తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా తమపై నమోదైన కేసుల గురించి ప్రచారం చేయాలని ఆదేశించింది.

More Telugu News