ap7am logo

షియోమి నుండి నాలుగు కెమెరాలతో 'రెడ్‌మీ నోట్ 6 ప్రో' విడుదల!

Fri, Sep 28, 2018, 05:03 PM
  • థాయ్‌ల్యాండ్ లో విడుదల
  • మూడు రంగులలో లభ్యం
  • త్వరలో భారత మార్కెట్లోకి
షియోమి నుండి నూతన స్మార్ట్ ఫోన్ రెడ్‌మీ నోట్ 6 ప్రో తాజాగా థాయ్‌ల్యాండ్ లో విడుదలైంది. పవర్ఫుల్ ప్రాసెసర్, వెనక భాగంలో రెండు, ముందు భాగంలో రెండు కెమెరాలతో విడుదలైన ఈ ఫోన్ లో ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ డిస్‌ప్లే ని ఏర్పాటు చేశారు. బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్ కలర్లలో లభించే ఈ ఫోన్ మన దేశంలో రూ.15,700కి లభ్యం అయ్యే అవకాశం ఉంది . కాగా, ఈ ఫోన్ ఇండియాలో విడుదల తేదిపై స్పష్టత లేనప్పటికీ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

'రెడ్‌మీ నోట్ 6 ప్రో' ప్రత్యేకతలు:

  • 6.26" ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
  • వెనక భాగంలో 12/5 మెగాపిక్సెల్ కెమెరాలు
  • ముందు భాగంలో 20/2 మెగాపిక్సెల్ కెమెరాలు
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్
  • 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad