ram charan: ఇప్పటికే పదకొండేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా!: హీరో రామ్ చరణ్

  • రామ్ చరణ్ సినిమాల్లోకొచ్చి నేటితో పదకొండేళ్లు పూర్తి
  • నిన్నే నటించడం ప్రారంభించిన భావన లో ఉన్నా
  • నాపై  ప్రేమాభిమానాలు చూపిస్తున్నందరికీ కృతఙ్ఞతలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో నటించడం ప్రారంభించి నేటితో పదకొండు సంవత్సరాలు పూర్తయింది. ‘చిరుత’ సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్, ఇప్పటి వరకూ పదకొండు చిత్రాల్లో నటించాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఇప్పటికే పదకొండేళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నానని, నిన్నే నటించడం ప్రారంభించిన భావన లో ఉన్నానని అన్నాడు. తనపై  ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ కృతఙ్ఞతలు అని, తన ప్రయాణంలో భాగస్వాములైన దర్శకులు, నిర్మాతలు, ప్రతిఒక్కరికీ కృతఙ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. ఈ సందర్భంగా  ‘చిరుత’ నుంచి ’రంగస్థలం’ వరకు చిత్రాల పోస్టర్లను చెర్రీ పోస్ట్ చేశాడు.

More Telugu News